180 రోజుల్లో భూమిలో కలిసిపోయే దుస్తులు రూపొందించింది గురుగ్రామ్ కు చెందిన హితేషా దేశ్ పాండే.రసాయనిక వర్ణాలు ,సింథటిక్ మెటీరియల్ అవసరం లేని పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ దుస్తులు తయారు చేసిందీమే. ఈ దుస్తుల కోసం కొంత వరకు చెట్ల నారా, సిల్క్ ఫ్యాబ్రిక్ తో వెదురు, వాల్ నట్స్, కూరగాయల పీచు వాడిన ఈ ఫ్యాషన్ దుస్తుల కాలపరిమితి భూమిలో పాతేసిన తరువాత కేవలం 180 రోజులు.అందుకే ఆ దుస్తుల జిప్ లు బొత్తాలు కూడా సహజమైన వాల్నట్స్ కూరగాయల పీచు తోనే చేశారు.దుస్తుల మేకింగ్ కూడా విత్తనాల నుంచి ఉత్పత్తి చేసిన స్పీడ్ పేపర్ నే ఉపయోగిస్తారు పెక్డ్  పేరుతో విడుదల చేసిన ఈ దుస్తులకు ఎంతో ఆదరణ దక్కుతోంది.

Leave a comment