మెదడకి ఎప్పుడు అలసట ఇవ్వకూడదు అనుకుంటే కొన్ని చిన్న చిన్న పనులు చేయచ్చు. ఒకెసారి రెండు పనులు చేయద్దు. తింటూ పేపర్ చదవటం టెలివిజన్ చూడటం కూడదు. పూర్తిగా తినే తాగే వాటిపైన ఫోకస్ చేయాలి లైన్ లో ఇతరత్రా దేనికోసమైన వెయిటింగ్ లో ఉన్నపుడు మైండ్ ఫుల్ కెప్ ప్రాక్టీస్ చేయాలి. బ్రీతింగ్ ప్రాక్టీస్ లేదా పరిసరాల్లోని విషయాలపై మనస్సు లగ్నం చేయాలి టెలిఫోన్ మోగిన ప్రతిసారి హటాత్తుగా దాన్ని అందుకొని సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయద్దు. సమాధానం ఇచ్చేందుకు గాను మెదడుని సమాయత్తం చేసేందుకు ఒకటి రెండు సార్లు లాంగ్ బ్రీత్ ఇవ్వాలి. సాధారణంగా అన్నిపనులు కుడి చేత్తో చేస్తారు . కానీ చిన్న పనులకు,కంటే బ్రేషింగ్,స్పూన్లు వాడటం వంటి వాటికోసం నాన్-డామినెంట్ చేతిని వాడాలి మెదడు కంట్రోల్ అప్పుడు ఆ చేతి పైన కూడా ఉంటుంది .

Leave a comment