వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే చక్కగా వుంటారు. చీరలు సల్వార్లు ప్యాంట్లు షర్టులు ఏవైనా కానీండి అభిరుచిని పట్టి ఎంచుకోవాలి. అవి ఎలాంటి వైనా బాడీ షేప్ ని గాక వ్యక్తిగత స్టయిల్ ను ప్రతిబింబించాలి . వాడే హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీస్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. వార్డ్ రోబ్ కు ఏ దుస్తుల్ని జత చేస్తున్నా విభిన్నతకు ప్రాధాన్యం ఇస్తూ సులువుగా మిక్స్ అండ్ మ్యాచ్ గా  ఉండేలా  జాగ్రత్త తీసుకోవాలి. పైగా వేసుకునే దుస్తులు ముందు సీజన్ కు మ్యాచ్  అవ్వాలి. మారే ఋతువుల్లో కొన్ని దుస్తులు కొన్ని వాతావరణాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు మారిన ఎండ వేళ లో నల్లని డ్రెస్ అందంగా వుంది కదా అని వేసుకుంటే వేడికి మూడ్ ఆఫ్ అయిపోతుంది .

Leave a comment