అందరు ఆఫీస్ లకే వెళ్ళి ఉద్యోగాలు చేయదు. ఇంట్లోంచి చేసే వ్యాపారం కూడా ఉద్యోగం వంటిదే. ఇంట్లోంచే కదా కష్టం ఏముంటుంది అంటారు, కానీ ఆలా ప్రత్యేక సౌకర్యాలు ఏమీ లేని చోట పని చేయించాలా కష్టం. దాన్ని తేలిగ్గ తీసుకోకండి ఒక ప్రణాళికతో ఆ పనిని ఇంకెంతో నైపుణ్యంతో చేయండి అంటున్నారు కెరీర్ నిపుణులు. ఇంట్లోంచే పనిచేసిన ఆఫీస్ కు వెళ్ళినట్లే తయారవ్వాలి. ఇంటికి,వ్యాపారం,లేదా ఇంటి నుంచి చేసే ఉద్యోగానికి చక్కని ప్రణాళిక వేసుకోవాలి. పని కోసం ఎంచుకున్న ప్రదేశం గాలి,వెలుతురు ఉండేలాగా శుభ్రాంగా ఉంచుకోవాలి. పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకొనే ఏర్పాటు,అప్పుడు ఏదైనా స్నాక్ తినే సౌకర్యం కూడా వుంచుకోవాలి . ఇంట్లోంచి పనిచేస్తున్న,కుటుంబ సభ్యులు ఆ పని విలువ తెలుసుకొని సహకారం అందించేలా,చేసే కష్టాన్ని అందరికీ షేర్ చేయటం చాలా ముఖ్యం.

Leave a comment