చక్కర తో పోలిస్తే బెల్లం లో కొన్ని రకాల ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక సాధారణంగా బెల్లం వాడకం మంచిదే.కానీ చూసేందుకు రుచి చూసేందుకు తప్పా క్యాలరీల్లో,రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచటంలో ఎక్కువ తేడాలు ఏమీ లేవు.పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా పరిమిత మోతాదు లో బెల్లం వాడుకోవచ్చు కానీ మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర బదులు బెల్లం వాడినా రక్తంలో గ్లూకోజ్ విషయంలో ఏమాత్రం తేడా ఉండదు.టీ కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజు వెళుతున్నప్పుడు అది చక్కెర అయినా బెల్లం అయినా ఒక్కటే.టీ కాఫీలు ఎలాటి తీపి లేకుండా తీసుకోవటం మంచిది.బెల్లం లో ఉండే విటమిన్లు ఖనిజాలు తాజా పండ్లు కూరగాయల గింజలు ధాన్యాలు ద్వారా దొరుకుతాయి.బెల్లం పూర్తిగా చక్కెర వంటిదే అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment