చక్కని సామాజిక జీవితం గడుపుతూ వుంటే ఇలాంటి అనారోగ్యాలు దగ్గరకు రావని ఒక రిపోర్టు. ఇటువంటి జీవితం వల్ల ప్రతికూల ఆలోచనలు రావు. వత్తిడి, అనారొగ్య కరమైన అలవాట్లు వుండవు. ఇటువంటి జీవితం ఏర్పరుచుకుని చక్కని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటోంది రిపోర్టు. సోడియం చక్కరలు తగ్గించి ఎక్కువ కాయగూరలు, పండ్లు, నట్స్, ఆహార ధన్యాలు లేగ్యుమ్స్ తీసుకుంటు వుంటే, అలాగే వారానికి రెండున్నర గంటల పాటు చురుకైన వ్యాయామం చేస్తే ఇక చక్కని ఆరోగ్యం మీ సొంతం అంటుందీ అధ్యాయినం. రోజు ఎనిమిది గంటలు నిద్ర పోయి, తగినన్ని మంచి నీరు తాగుతూ వుంటే ఈరు జాయింట్లను మాయిశ్చురైజ్ చేసి అన్ని రకాల నొప్పుల నుంచి కాపాడుతుంది అని స్పష్టం చేసిందీ రిపోర్టు సారంశం.

Leave a comment