అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట  చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే 40 కిలోల బరువు కేవలం ఫిట్ నెస్ శిక్షకుడి ఆధ్వర్యంలో కష్టపడి తగ్గించుకున్నాడని  మనం మాత్రం అందులో ఐదో వంతైనా చేయలేమని నెట్ లో వెతికితే పెద్దగా బరువులో వత్తిడి ఆయాస పడనక్కర్లేదని తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అవన్నీ ఒక ఆటలాగా సరదాగా ప్రేమగా మొదలుపెడితే చాలు. ఐదు నిముషాలు నుంచి మొదలు పెట్టి అరగంట వరకు సాగదీయచ్చు. అంతెందుకు మన శరీరం లో వచ్చే మార్పులు చెమటోడిస్తే మోహంలో కనబడే మెరుపు మనకు తప్పనిసరిగా ఉత్సాహం ఇస్తాయి . ఓ నెలయ్యాక  ఎవరో ఫ్రెండ్ ఎదురై ఎంత బావున్నావో కాస్త తగ్గావు మోహంలో ఎదో సమ్  థింగ్ స్పెషల్ కనిపిస్తోంది. అన్నారనుకోండి ఇంకా ఉత్సాహమే ఉత్సాహం !!

Leave a comment