చాలా మంది ముహుర్తాల పైన నమ్మకం వుంటుంది. ఈ ఘడియ సుముహూర్తం అని, ఇది దుర్ముహుర్తం అని నమ్మకంతో ఆ టైమ్ లో ఏ ఏ పనులు చేయచ్చు చేయకూడదనో నిర్ణయించుకొంటారు. ఈ పనిని లండన్ వాళ్ళు కుడా సర్వే చేసి నిర్ణయించారు. లాన్ కాస్టర్ విశ్వవిద్యాలయం వారి నివేదిక ప్రకారం పగలు 11.59 గంటలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే మంచి టైమ్ అని తెచ్చారు. ఆ సమయంలో మెదడు శరీరం చురుగ్గా వుండటం వల్ల అప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయట. ఇక రాత్రి 10 గంటల తర్వాత తీసుకునే ఏ నిర్ణయము సవ్యంగా వుండదట. అది నిద్రించే వేళకదా మరి మరి ఈ సమయం కరక్టేనంటారా?

Leave a comment