చల్లని వేళలో ఏదైనా పానీయం కావాలి. ఆ పానీయం రుచి, ఆరోగ్యం రెండు ఇవ్వగలగాలి. అలా కావాలంటే హెర్బల్ టీలు తాగమంటారు ఎక్స్ పార్ట్స్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పిప్పర్మెంట్ టీ, వైట్ టీ ఇక పొతే శొంటి, దాల్చిన చెక్క టీ చాలా మంచివిగా చెప్పుతున్నారు. ఇప్పుడు శొంటి పొడి వేసినా మరిగించినా టీ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పని చేస్తుంది. అలర్జీలు తగ్గిస్తుంది. రుచి అమోఘం. అలాగే దాల్చిన చెక్క పొడిని మరుగుతున్న నీటిలో టీ పొడి తో పాటు కలిపి మరిగించి రుచి కోసం పాలు పంచదార కలిపి తాగితే ముందుగా స్వాంతన కలుగుతుంది. ఈ టీ కోలెస్ట్రోల్ తగ్గించగలరు. వైరస్ లతో పోరాడుతుంది. ఆర్దరైటీస్ లక్షణాలు పోగొడుతుంది. మనస్సుకి శరీరానికి స్వాంతన కలిగించే ఈ వేడి పానీయం తాగడం మంచిదే కదా.

Leave a comment