సువాసన గల పెర్ఫ్యూమ్ కొనాలి అనుకొంటాం .వరుసగా ఎన్నో బ్రాండ్స్ ,ఏన్నో రకాల ఆకారాలతో అందమైన సీసాలు ఏది కొనాలి,ఏ పరిమళం ,ఎంతసేపు చెడిపోకుండా ఉంటుందో అర్ధం కాదు. ఫ్యూర్ పర్ ఫ్యూమ్,ఓద పర్ ఫ్యూమ్ ,ఓద టాయ్ లెట్ అన్ని సెంట్ లలో రకాలుంటాయి. సెంట్ తయారైన తీరు వాటిలో గాఢతను తెలిసే పేర్లు ఇవి. సెంట్ తయారీలో సింథటెక్ నూనెలకు ఆల్కహాల్ కలుపుతారు. ఈ రెండింటి కొలతలకు సంబందించి సెంట్ ఘాట్ నిర్ణయించుకోవాలి. ఫ్యూర్ పర్ ఫ్యూమ్లో ఆయిల్ 15 నుంచి 30 శాతం ఉంటుంది. ఓద పర్ ఫ్యూమ్ లో పెర్ ఫ్యూమ్ ఆయిల్ 15 నుంచి 20 శాతం వరకు ఉంటే ఓద టాయిలెట్ లో ఐదు నుంచి 15 శాతం పర్ ఫ్యూమ్ ఆయిల్ ఉంటుంది. సువాసన ఎంత సేపు ఉంటుదనేది సెంట్ సీసాల లేబుళ్ళ మీద ఉండే టేబుళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు.

Leave a comment