టీ ఆకును క్యాన్సర్ మందుగా రూపోందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు లండన్‌ కు చెందిన స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఒక పరిశోధన నిమిత్తం తేయాకులలోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల పైన ప్రయోగిస్తే అవన్ని దాదాపు పోయాయి. ఇతర క్యాన్సర్ మందుల కంటే ఈ తేయాకుతో తయారు చేసినవి శక్తివంతంగా పని చేస్తాయట. తేయాకు కు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువని వాటితో పాటుగా ఈ ఆమ్లల్లో ఉండే ఫాలిఫినాల్స్, అమైనో ఆమ్లాలు విటమిన్ల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ 80 శాతం తగ్గిపోతుందని పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment