ఈ చలి కాలంలో చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండేందుకు గానూ భోజనంలో కాస్త నెయ్యి వాడుకోమంటున్నారు. రోజు నెయ్యి తీసుకుంటే చర్మం యవ్వనవంతంగా ఉంటుంది. నెయ్యి చక్కని మాయిశ్చరైజర్. ఒంటికి నెయ్యితో మసాజ్ చేసుకుంటె కూడా మంచిది. నెయ్యిలో ఉండే ఇ విటమిన్ చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. నెయ్యి చక్కని బాత్ ఆయిల్ నెయ్యిలో కొద్దిగా లావెండర్ నూనె కలిపి స్నానం చేసే ముందర మసాజ్ చేసుకుంటే ఒళ్ళు చలికి పగిలిపోకుండా ఉంటుంది. పని వత్తిడిలో అలసిపోయిన కళ్ళ చుట్టు చర్మం నల్లబడుతుంది. ఆ నలుపు పోయేందుకు నెయ్యితో కళ్ళ చుట్టు సున్నితంగా మర్ధన చేసినట్లు రాసుకుంటే నలుపుపోతుంది.

Leave a comment