అన్ని పోషకాలు సక్రమంగా అందితేనే చర్మం ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-ఇ చర్మానికి తాజాదనం ఇస్తుంది. విటమిన్-ఇ నూనెతో శరీరానికి మర్దన చేయటం ఒక అవసరం కళ్ళ కింద ముడతలు నలుపు వంటివి తగ్గుతాయి అలాగే శరీరం పై చారలున్న వాటి పై విటమిన్-ఇ నూనె రాస్తే ప్రయోజనం వుంటుంది. ఈ నూనెతో చర్మ కణాలు పునరుత్తేజం చెంది మచ్చలు తగ్గుముఖం పడతాయి. విటమిన్-ఇ లోని యాంటి ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ పోషకం చర్మానికి క్లేన్సింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. బాదం ఆలివ్ గింజలు,పాలకూర,చిలకడ దుంప పొద్దు తిరుగుడు గింజలు ఆలివ్ నూనెతో విటమిన్-ఇ అధిక మోతాదులో లభిస్తుంది. చర్మం మెరిసిపోవాలంటే ఇవన్నీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

Leave a comment