నీహారికా,

ఏవరేనా, ఎప్పుడైనా సెల్ఫ్ పిటి వలలో ఇరుక్కున్నారంటే ఇంకెప్పటికీ ఆ ఊబి లోంచి బయట పడలేదు. నిజంగానే సెల్ఫ్ పిటి ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఎలాంటి పరిస్థితినయినా సమర్ధించుకొ గలిగిన వారు. ఈ ఆత్మన్యుత వేదించదు, భరించదు. ఎవరి జీవితాన్ని వాళ్ళ అవకాశాల మేరకు నడిపించుకోవాలి. గానీ అనుక్షణం సామాజిక అంచనాల గురించి వెంపర్లాడకూడదు. మన జీవితంలో మనం నేట్టుకెల్తున్న ఈ నిరాశ అందరికీ పాకిపోయి ప్రతి వాళ్ళ సానుభూతినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇదొక అంటువ్యాధి, ఇంట్లో ఒకళ్ళ తో మొదలైన ఈ సెల్ఫ్ పిటి సమస్య అందరికీ అంటుకుని డిప్రెషన్ లో పడిపోతాం. ఇప్పుడు మన పట్ల మనకి జాలీ దయ వుండదు. అయ్యో పాపం అనుకోకూడదు. మనమేదో కష్టాల్లో ఉన్నట్లు ఫీలయి పోయాము సమస్యలో పడిపోతాం. ఎలాంటి స్ధితినయినా ఎదుర్కునే సమర్ధత ఉంటేనే జీవితంలో సంతోషం వున్నట్లు అర్ధం చేసుకోవాలి.

Leave a comment