శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపీకలపని గ్రీన్ టీ, నీటి జాబితాలో వేయచ్చు. షుగర్ ప్రీ మింట్ గమ్, లేదా మింట్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ భోజనానికి ముందు వాడితే తినే ఆహారం మోతాదు తగ్గిపోతుంది. ఇక తినటాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందని మెదడుకు మింట్ ఫ్లేవర్స్ సిగ్నల్స్ పంపుతాయి. దీని వల్ల భోజనం తర్వాత డిజర్టులు ఇతరత్రా చిరు తిండ్లు తినలేక పోతారు. ఉదయం పుషప్స్ తీయాలి. వేడి వేడి సాస్ వల్ల ముఖ్యంగా చిల్లి సాస్ వంటివి జీవ క్రియను మెరుగు పరుస్తాయి. యోగా వంటివి వత్తిడి తగ్గిస్తాయి. వత్తిడి తగ్గే కొద్దీ కోలెస్ట్రాల్ స్థాయి తగ్గితుంది. అంటే శరీరం కొన్ని క్యాలరీలను మాత్రమే కొద్దిగా నిల్వ చేసుకుంటుంది. మసాజ్ లు కుడా శరీరంలోని ఇన్ఫెమేషన్ ను తగ్గిస్తాయి. టెలివిజన్, కంప్యుటర్ల ముందు కుర్చుని ఎప్పుడు భోజనం చేయ కూడదు.

Leave a comment