గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో  చేతులు జోడించి పాదాలకు నమస్కారం  చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి ఏడో తరగతి చదివే వరకు లత  దగ్గర డాన్స్ నేర్చుకుంది. వేదిక పైన గురువు లతా కనిపించగానే ఐశ్వర్య పట్టలేని సంతోషంతో  పొంగిపోయింది. గురువు పాదాలకు నమస్కారం పెట్టగానే ఆహ్వానితులందరూ ఒక్కసారి లేచి నిలబడి తమ గౌరవం ప్రకటించారు. అందనంత ఎత్తులో వుండేది  గురుస్థానం ఐశ్వర్య వంటి సెలబ్రెటీ గురువు కనిపించాగానే ఆమెను కౌగలించుకుని నమస్కరించటం అది ఐశ్వర్య సంస్కారం లతా అదృష్టం.

Leave a comment