ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల శక్తికి చిహ్నమే కాదు ఆసియాలోనే అతి పెద్ద మహిళల మార్కెట్. 16వ శతాబ్దంలో ఏర్పాటైనట్లు భావిస్తున్న ఈ మార్కెట్ లో 500 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పెళ్ళయిన మహిళలు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించవచ్చు. ఇక్కడ వ్యాపారం కోసం మహిళలు కేవలం 40 రూపాయలు చెల్లిస్తే చాలు. వీళ్ళకి యూనియన్ వుంది. సభ్యులకు రుణాలిస్తుంది కూడా. ఇది కేవలం మార్కెట్ మాత్రమే కాదు మణిపూర్ మహిళల జీవన దర్పణం. 16వ శతాబ్దంలో జీవనోపాధి కోసం మగవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, ఇంకా యుద్దాల్లో పాల్గొనడం వల్ల ఆడవాళ్ళ కోసం ఇమాకైథల్ ఏర్పడిందని చెప్తారు. ఈ మార్కెట్ మహిళలు ఆంగ్లేయుల నుంచి తమ సరుకులను రక్షించుకొనేందుకు తుపాకులను పట్టుకొని పోరాటం చేశారు ఆ పోరాటం నూపిలాన్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ పోరాటం లో ప్రాణాలు ధారపోసిన మహిళల గుర్తుగా ఇంఫాల్ లో ఒక మ్యూజియం వుంది.
Categories
WoW

ఇది మణిపూర్ మహిళల శక్తికి ప్రతీక

Leave a comment