సెలబ్రిటీలు అన్నింటిలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇటు సమాజ సేవ అటు నటన అన్ని మా పనులే అంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు అదే పనిలో ఉంది. దృష్టి కోల్పోయినవారికి కళ్ళను దానం చేద్దాం అంటుంది. అమలాపాల్ అమలా హోమ్ అనే ఫౌండేషన్ స్థాపించింది. నేత్రదానం చెయ్యాలనుకుంటే ఈ ఫౌండేషన్ లో సంప్రదించవచ్చు. నేను ఒక సంస్థకు చెందిన ప్రమోషన్ ప్రోగ్రాం కోసం మాట్లాడేందుకు సిద్దం అవుతూ కొన్ని విషయాలు శ్రద్దగా తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది చూపు లేక బాధ పడుతున్నారు. వారిలో ఎక్కువ మంది ఇండియాకు చెందిన వాళ్ళే. నాకెంతో షాక్ అనిపించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఫౌండేషన్ స్థాపించాను అంటుంది అమలాపాల్.

Leave a comment