కరోనా సమయంలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వర్చువల్ ప్రపంచంలో యువతరం ఎక్కువసేపు గడుపుతోంది. వండిన, తినా,కొత్త డ్రెస్ వేసుకొన్న ఒక పాట పాడిన, పుస్తకం చదివిన అవన్ని సెల్ లో క్లిక్ మనిపించడం సోషల్ మీడియాలో పెట్టటం ఒక లైక్ ల కోసం ఎదురు చూడటం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఈ లైక్ ల కోసం ఎదురు చూడటం సెల్ఫీలు పోస్ట్ చేసి రెస్పాన్స్ కోసం ఎదురు చూసే యువత లో ఈటింగ్ డిజార్డర్స్ పెరుగుతున్నాయినీ చెబుతుంది ఒక అధ్యయనం. అందమైన ఫోటోలు పెట్టాలనే కోరికతో బరువు పెరగకుండా అందమైన ఫిజిక్ లో కనబడాలనే కాంక్ష వారిలో ఆందోళన పెంచుతోంది. తినడం మానేస్తుంటారు ఇది క్రమంగా డిప్రెషన్ కు దారి తీస్తోందని యువత విషయంలో జాగ్రత్త తీసుకొమ్మని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు అధ్యయనకారులు.

Leave a comment