పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల కళ్ళు వాలిపోతాయి. అందమైన శ్రీదేవి సాదా స్కర్టులు వేసుకుని పువ్వుల ప్రింట్ల ప్యాంటు వేసుకున్న, ప్రాక్ మొత్తం పువ్వులతో నింపివేసి పువ్వు కంటే అందమైన చిరునవ్వుతో  తమన్నా మెరిసినా, టాప్ టు బాటమ్ పువ్వుల డ్రేస్ లు ఐశ్వర్యారాయ్ చిరునవ్వులు చిందించినా, ఇంకా ఆ డ్రెస్సు అమ్మాయిల లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోతుంది. పువ్వుల లతలు ఎప్పుడు అందంగానే వుంటాయి. అవి పట్టు చీరపై అల్లుకున్న, షిఫాన్ చీర పై విరిసినా, చక్కని కాటన్ చీర నిండా పరుచుకున్నా అందమే అందం. ఇప్పుడు విసిగించే వేసవిలో రిలాక్స్ గా కనిపించడం కోసం లేత వర్ణాల దుస్తుల పై పువ్వుల ప్రింట్స్ కోసం షాపింగ్ చేయడం బెస్ట్.

Leave a comment