కాసేపు ఎండలో ఉన్నా సూర్య రశ్మి ప్రభావంతో చర్మం పై నీటి శాతం తగ్గి చర్మం పొడి బారిపోతుంది. పెదవులు, కణతలు దగ్గర డ్రై ప్యాచ్ లు కనిపిస్తాయి. చర్మంలో తేమ కోసం ఎక్స్పోజ్ అయ్యే అన్నీ శారీరక భాగాలపైనా కొబ్బరి నూనె అప్లయ్ చేస్తే ఏంటో ప్రయోజనకరంగా ఉంటుంది . కొబ్బరి నూనె సహజకరమైన సన స్క్రీన్. ఇందులో ఎస్. పి . ఎఫ్ ఎనిమిది వరకు ఉంటుంది. దీన్ని తరచూ శరీరానికి అప్లయ్ చేయడా వల్లన లాభమే. చర్మం ఈ నూనెని పీల్చుకునే దాకా గుండ్రని స్ట్రోక్స్ తో మసాజ్ చేసుకోవాలి. ఎంత సేపు ఎండా తగిలితే కంటి కింద సున్నితమైన చర్మం ప్రభావితం అవ్వుతుంది . కొబ్బరి నూనె చక్కని, అద్భుతమైన అండర్ ఐ క్రీమ్. చర్మాన్ని ముడతలు పడకుండా పరిరక్షిస్తుంది. కళ్లకింద నల్ల ముడతలు రానీయదు.

Leave a comment