ప్రముఖ నటి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన కెమికల్ ఫ్రీ క్లీనర్ తయారీ వైరల్ అవుతోంది.తుడుచుకొనేందుకు వాడే క్లీనర్ లలో ఎన్నో రసాయనాలు ఉంటాయి.  ఇంట్లో తయారు చేసుకునే బయో ఎంజాయ్ లు ఇంటి శుభ్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు సమంత.బయో ఎంజైమ్ తయారు చేయటం చాలా సులభం 300 గ్రాములు నిమ్మజాతి పండ్ల తొక్కలు 100 గ్రాములు బెల్లం ఒక లీటర్ నీళ్ళు కొద్దిగా ఈన్ట్ తీసుకొని వీటన్నింటిని గాలి దూరని ప్లాస్టిక్ కంటైనర్ లో పోయాలి దీన్ని వెలుతురు పడని చోట పెట్టాలి.మొదటి పది రోజులు ప్రతి రోజు మూత  కొన్ని సెకండ్ల పాటు తెరవాలి.తర్వాత రోజు విడిచి రోజు కొన్ని సెకండ్ల పాటు మూత తెరిచి పెట్టేయాలి.నెల రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని పిండితే బయో ఎంజైమ్ రెడీగా ఉంటుంది. ఇది ఫ్లోర్ క్లీనర్ గా గిన్నెలు తోమేందుకు కూడా ఉపయోగపడుతుంది.

Leave a comment