దానిమ్మ ఇంజలు ఇష్టపడని వారుండరు. ఎంచక్కని ఎరువుతో ఈ గింజలు ఎన్నో ఆహార పదార్ధాలని అలంకరణ కోసంగా కుడా వాడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని ఎడినల్ బడ్స్ లోని క్వీన్ మార్గరేట్ యునివర్సిటీ వారు వెల్లడించారు. ప్రతి రోజు గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం తో సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ స్ధాయి పెంచుతుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన లో పాల్గొన్న యువతలో, యువకుల్లో ఈ హార్మోన్ స్దాయి పెంచడం తో పాటు, మూడ్ మెరుగు పడటం, వత్తిడి తగ్గడం పరిశోధకుల దృష్టికి వచ్చింది. శృంగార వాంఛలు పెరిగే విషయంలో ఇంకా పరిశోధనా కొనసాగుతూ ఉన్నా, దానిమ్మ రసం మాత్రం రోజు తీసుకోండి దీని వల్ల లాభమేనని దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని పరిశోధకులు చెప్పారు.

Leave a comment