అన్ని ఉప్పుల్లోనూ హిమాలయన్ రాక్ సాల్ట్ గా పిలిచే గులాబి రంగు ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని కేవ్రా ఉప్పు గనుల్లో ఉంటుంది. హిమాలయాలకు 310 కి.మీ దూరంలో ఉంటాయి. ఈ రాక్ సాల్ట్ లో కాల్షీయం,పొటాషియం,మెగ్నిషీయం వంటి ఎన్నో ఖనిజాలున్నాయి. ఈ ఉప్పు రాళ్ళతో లైట్లు తయారు చేస్తున్నారు.ఈ లైట్లు గాలిని శుభ్రం చేసి ఆరోగ్యాన్నిస్తాయి. కొన్ని స్పాలలో ఈ ఉప్పు రాళ్ళతో చికిత్సలు చేస్తున్నారు.ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ ని కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన గుహల నుంచి తీస్తున్నారు. కనుక ఇది స్వచ్చంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెపుతున్నారు.

Leave a comment