Categories
Wahrevaa

ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.

తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో సహకరిస్తుంది. దీనికి రక్తాన్ని సుద్ధి చేయగల గుణం వుంటుంది. మంచి ఫలితాల కోసం బెల్లంను ప్రతి రోజు పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకోవాలి. బెల్లం శరీరాన్ని అన్ని రకాల విపత్తులనుంచి పరిరక్షిస్తుంది. మహిళలు బెల్లాన్ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త హీనత తగ్గిపోతుంది. ముఖ్యంగా టీనేజర్లు, గర్భవతులు తినడం చాలా అవసరం. మొటిమలు పోక్కులతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా బెల్లం తినడం వల్ల మంచి ఫలితం వుంటుంది. తిన్న వెంటనే శారీరానికి శక్తి సమకూరడం తెలుస్తుంది. జాయింట్ నొప్పులు, మైగ్రేన్ తో భాధ పడే వాళ్ళు ప్రతి రోజు చిన్న అల్లం ముక్క నూరి బెల్లంతో కలిపి తింటే ఉపసమనం. ఇందులో వుండే యాంటీ ఎలర్జీ లక్షణాల వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గిపోతాయి.

Leave a comment