ధూమపానం ,మద్యపానం ,జంతుహింస కంటే మహిళ పై చేయి చేసుకోవటం ,చెంప దెబ్బలు కొట్టడం గృహహింస చిన్న విషయాలు కాదు . సినిమా ల్లో మందు తాగద్దని ,సిగరెట్లు తాగద్దని యాడ్  వేసినట్లే గృహ హింసకు వ్యతిరేకంగా హెచ్చరికలు రావాలి .  మహిళ పై చేయి చేసుకోవటం,గృహహింస పైన హెచ్చరికలు రావాలని చేంజ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ కు నేను మద్దతు ఇస్తున్నా అని ట్విట్టర్ పోస్ట్ చేసింది తాప్సి . జంతువులతో తీసిన సినిమాల్లో వాటిని హింసకు గురిచేయడం తప్పు అని హెచ్చరిక ఉన్నట్లే గృహహింస నేపథ్యంలో తానే సినిమా లలో కూడా ఇదితప్పు అని హెచ్చరిక వేయండి అని డిమాండ్ చేస్తోంది తాప్సీ . ఆమె నటించిన చిత్రం తప్పడ్ ,అంటే చెంపదెబ్బ ,ఒక చెంపదెబ్బ కొట్టాడని భర్తతో విడాకులు కోరే భార్య కధతో ఈ సినిమా రాబోతోంది .

Leave a comment