జీడిపప్పు వలచి తీసుకున్నాక ,ఆ పై గింజల్ని ఇప్పటి వరకు పాడేస్తూనే ఉన్నారు . కానీ కొందరు పరిశోధకులు వృధాగా పారేసే వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి ఉడ్ కెమిస్ట్రీ అనే కొత్త రసాయన విధానం ద్వారా మానవాళికి ఉపయోగపడే పదార్దాలు వేరుచేయగలిగారు. అలాగే వృధాగ పడేసే జీడీ తొక్కల నుంచి తీసిన సువాసన భరితమైన రసాయనాలను హానికర అతినీల లోహిత కిరణాలూ గ్రహించి చర్మాన్ని రక్షించే గుణం ఉందని, కాబట్టి వీటిని సన్ స్క్రిన్స్ లో వాడుకో వచ్చని కనిపెట్టారు . అలాగే యువీ కిరణాల కారణంగా దుస్తులు ప్లాస్టిక్ వస్తువుల రంగులు పోతుంటాయి అలా పోకుండా   సన్ స్క్రిన్ లు ,ఈ వస్తువుల్లో ఆక్సీ బెంజన్ వంటి పెట్రోలియం ఉత్పత్తిని వాడుతున్నారు. దీనిస్థానంలో జీడిపిక్కల రసాయనాన్ని ఉపయోగించటం ఖర్చు తక్కువలో అయి పోతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు .

Leave a comment