ఇది వరలో పొడుగాటి జడలు కావాలనుకంటే సవరాలు వుదేవి. ఇప్పుడు పొడవాటి  జుట్టు బుజాలు దాటి అలల్లా వీపంతా పరుచుకోవాలి. అనుకుంటే హెయిర్ ఎక్సటెన్షన్లు వున్నాయి. ఇప్పుడా ట్రెండ్ కుడా మారింది. పొడవాటి పోనీలు వుండాలి. అవి ఎన్నో రంగులతో  కళకళ లాడాలి. అవీ మార్కెట్లోకి వచ్చేసాయి. వేవీ హార్స్ టెయిల్ హెయిర్ ఎక్స్ టెన్షన్స్ పేరుతో ఎన్నో రకాల పోనీలు. గిరజాలు కావాలా? పొడవాటి జుట్టే కావాలా? అదీ చక్కని రంగుతో ఉండాలా? అన్ని వరుసగ్గా కనువిందు చేస్తాయి సొంతంగా ఓ చిన్ని పోనీ వుంటే దానికో రిబ్బన్ తో ఈ హార్స్ టెయిల్ హెయిర్ ఎక్సటెన్షన్ కట్టేసి గిరిజాల జుట్టు అలల్లా ఎదిగే జుట్టు చివర్లు గులాబీలుగా రింగులు ఎవరయినా అడగచ్చు. ఆన్ లైన్ లో ఆర్డరిస్తే ఇంటికొస్తాయి.

Leave a comment