నీహారికా ,

మనకి అస్తమానం  అందరు ఎదో ఒకటి చెప్పాలని చూస్తారు. వినటం చాలా బోర్ అనేసారు. నీకో విశేషం చెప్పనా …. విజేతలకుండే మొదటిలక్షణం ఎదుటివాళ్ళ ఆలోచనలు స్వాగతించటం . అన్ని రకాల ఆలోచనలు మనకే రావుకదా. కొత్త ఆలోచనలు రావాలి. ఇది కొత్త విషయాలకు కొదవ లేని కాలం. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే కదా సోషల్ మీడియా ఉపయోగించుకునేది. చిన్న చిన్న వ్యాపారాలు ఆలోచనలోకి వచ్చాయనుకో . స్టార్ట్ప్స్  గురించి పదిమందికీ  పంచుతున్నారు. ఆలోచన బావుంటే పదిమంది సహకారం దొరుకుతుంది. ఇతరుల మాటలు ఆలోచనలు వినటం మంచి లక్షణాలకు తోడు ఇంకో  అదనపు లక్షణం అనుకోవాలి. కొత్త సలహా నిగ్రహంతో విను. నీకు ఇంకో కొత్త ఆలోచన వస్తుంది. ఒకరు ఎదిగారంటే అందుకు ఎందరిదో సహకారం ఉంటుంది తెలుసా. అసలు చాలా మందితో పరిచయం కలిగి ఉండటమే నెట్వర్కింగ్. ఆలా పరిచయం ఉండటం అంటే అంతమంది ఆలోచనలు మనసు చేరుతున్నట్లే కదా. ఎన్నో మాట సహాయాలూ  వనరులు పంచుకునే సమయాలు సమస్యల పైన చర్చలు పరిష్కారాలు అందుతాయి. ఇది లాభమా ? నష్టమా ? చెప్పు . వినటం బోర్ కాదు అవసరం. విజయసాధనకు మొదటిమెట్టు.

Leave a comment