చెమటలు పోస్తుంటే వాతావరణం వేడిగా ఉండటం వల్లనే అనుకోకండి. ఇతరాత్రా ఎన్నో కారణాలున్నాయి గమనించండి అంటున్నారు వైద్యులు. థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పని చేస్తున్నా చెమటలు పట్టవచ్చు. అలాగే నరాల వ్యవస్థ దెబ్బతినటం వల్ల కూడా ఎక్కువ చమట పడుతోంది. అలాగే ఇది డయాబెటిక్ న్యూరోపతీ వల్ల కూడా అవ్వచ్చు. శరీరంలో ఇన్ ఫెక్షన్ పెరిగితే చెమటలు పోస్తాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కనుక చెమట పట్టటంలో ఎదైనా అసాధారణంగా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కారణాన్ని తప్పని సరిగా గుర్తించే ప్రయత్నం చేయాలి.

Leave a comment