బాలీవుడ్ లో దీపిక పడుకునే చక్కని ఫిట్ నెస్ తో ఉంటుంది. అంత నాజుగ్గా ఉండటానికి కారణం తాను బాడ్మింటన్ ఆడటమే అంటుందామే. బరువు తగ్గటం అంటే కేవలం తిండి మానేస్తే సరిపోదు. పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నేను మంచి ఆహరం తీసుకుంటాను. యోగ, పైలేట్స్,డాన్స్ , వేయిట్స్ మొదలైన వ్యాయాయం చేస్తాను. ఇక డాన్స్ సంగతి సరే. కథర్, భరతనాట్యం అన్ని ప్రాక్టీస్ చేస్తాను. పుష్అప్ లు, పుల్అప్ లు,స్కాట్లు తో కార్డియోలు పొట్టకండరాలకు తగిన వ్యాయామం అందేలా చేస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యం వారానికోసారి బాడ్మింటన్ తప్పనిసరి. ఈ బాడ్మింటన్ నన్ను మానసికంగా, శారీరకంగా, ధృడంగా ఉంచుతుంది అంటుంది. దీపిక పడుకునే. చెమట చిందిస్తే తీరైనశరీరాకృతి సొంతం అయ్యేది.

Leave a comment