రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ పులిమేస్తే ప్రయోజనం ఉండదు.స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అప్పుడు అదుపులో ఉంటుంది. అవసరానికి మించి స్క్రబ్ వాడకూడదు . రెండు స్పూన్ల చక్కర లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేయాలి. సబ్బులోని రసాయనాలు చర్మం దెబ్బతినేందుకు కారణం కావచ్చు. చర్మ తత్వానికి సరిపోయే ఫెస్ వాష్ ఎంచుకుని వాడుకోవాలి. సమస్యను అసలైన కారణం తెలుసుకుని పరిష్కారం కోసం చుస్తే ప్రయోజనం ఉంటుంది.

Leave a comment