వివాహితులు వారు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా సంతానోత్పత్తి తగ్గిపోతుందని చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆరు వేల మంది మహిళల పై ఈ పరిశోధన సాగింది. కొన్ని పండ్లు,ఇతర పోషకాలు తీసుకున్న మహిళలు త్వరగా గర్భం దాల్చటం వీరు గుర్తించారు. కేవలం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలు కొన్ని వారాలు,నెలలు ఆలస్యంగా గర్భం దాల్చారట. ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తూ గర్భదారణను ఆలస్యం చేసే జంక్ ఫుడ్ మానేయండనే సలహా ఇచ్చారట.

Leave a comment