‘అమ్మ కి థాలీ’ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే వీడియోలు సంఖ్య 730 వీటిని 27 కోట్ల మంది చూశారు. అమెరికా దుబాయ్, పాకిస్తాన్,ఫిజీ తో పాటు చాలా దేశాల్లో ఈ ఛానల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో కేవలం ఉత్తర ప్రదేశ్ కు చెందిన స్థానిక వంటలే ఉంటాయి. వంట చేసే శశికళ కనిపించరు. కానీ ఆమె చెప్పే వంటల వీడియోలకు వీక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యవసాయ కూలీగా బతికే ఆమె జీవితం 2016 లో ఆమె పెద్ద కొడుకు ఆమె వంట చేసే వీడియో నీ పోస్ట్ చేయడంతో మారిపోయింది. ఆమె ముగ్గురు కొడుకులు కలిసి ఆమె వంటకాలు షూటింగ్, ఎడిటింగ్ పోస్ట్ చేస్తారు. ఇంటర్నెట్ గురించి ఏమాత్రం తెలియని శశికళ ఇవాళ వంటల స్టార్ గా గుర్తింపు పొందింది.

Leave a comment