పూర్వ కాలంలో స్త్రీ లు ఏడు వరాల నగలు ధరించే వాళ్ళు . అందంతో పాటు ,గ్రహానుకూలం కోసం ,ఒక్కో రోజు ఒక్కో గ్రహానికి ఇష్టమైన నగలు ధరించే వాళ్ళు . ఆదివారం సూర్యునికీ ఇష్టమైన కెంపుల ఆభరణాలు ,సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాలు ,మంగళవారం ఆ దినానికి అధిపతి అయిన అంగారకుని కోసం పగడం ,బుధవారం బుద్ధుని అనుగ్రహం కోసం ఆకుపచ్చని పచ్చల హారాలు గురువారం గురువు కోసం పుష్య రాగాల నగలు శుక్రవారం ఆ రోజుకి అధిపతి శుక్రునికి అనుగ్రహాన్ని కోరుతు తెల్లని వజ్రాలు శనివారం నీలమణుల హారాలు ధరించేవాళ్ళు . ఏడు వారాల నగల వెనుక రహస్యం ఇదే . ఆయా గ్రహాల అధిపతుల ఆశీర్వచనం కోసం ఆ నగలు ,అదే రంగు దుస్తులు ధరించేవాళ్ళు .

Leave a comment