లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి చేస్తుంది. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్స్, బాంగిల్స్, బ్రూచ్ లు, కఫ్ లింక్స్ ఆమె ప్రత్యేకతే అనొచ్చు. చేతులకు వెళ్ళు లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, పట్టుదలతో ఇలా వున్నాను కనుక నాకిది లోపం అనిపించదు. వేళ్ళు లేకపోయినా నాపనులు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత డిజైనర్ గా నగల్ని తాయారు చేయడం నాకు కష్టం అనిపించ లేదు అంటుంది అన్నెట్టి.

Leave a comment