అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల  పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు  కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ చాక్లేట్ల  బదులుగా గ్రీన్ టీ చామంతి హెర్బల్ టీ తాగచ్చు. మంచి నీళ్లు బాగా తాగితే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవకుండా ఉంటుంది. మంచి పోషకాహారానికి  ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా వుండే డైట్ తీసుకోవాలి. అలాగే ఆహారం  జీర్ణం  అయ్యేందుకు శరీరం చైతన్యం ఉండేందుకు పది పదిహేను ,నిమిషాలు  నడక కూడా ఆనందమే. అలసట చిరాకు వత్తిడీ వంటివి ఎదుర్కొనేందుకే మంచి ఆహారం.

Leave a comment