కొన్ని ఆహారపు అలవాట్లలో అనారోగ్యం దాక్కుని వుంటుంది. కొందరు రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేసి తిన్న వెంటన్ నిద్రకు ఉపక్రమిస్తారు. భోజనం పూర్తి అయిన గంటలోగా విశ్రాంతి తీసుకుంటే షుగర్, కొవ్వు రక్త పోటు పెరిగే అవకాశం వుంది. అలాగే భోజనం పోర్ర్తి అవ్వుతునే టీ తాగటం కుడా నష్టమే ఈ టీ వంటి ద్రవాలు ఐరన్ గ్రహించకుండా అడ్డుపడతాయి. ఇంకో చిన్ని పొరపాటు భోజనం చేసిన వెంటనే వ్యాయామానికి  ఉపక్రమించడం అటు వ్యాయామం చురుగ్గా సాగదు. ఇటు జీర్ణక్రియ సరిగా వుండదు. అలాగే తిన్నా జీర్ణం అయ్యేందుకు అవసరమైన ఎంజైమ్ లు పండ్ల లో వున్నాయి కానీ భోజనం తర్వాత పండ్లు తింటే మాత్రం ఇవి తేలిగ్గా అరగవు . ఇలాంటి అలవాట్ల గురించి ద్రుష్టిలో వుంచుకోవాలి.

Leave a comment