ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి ఆ రసంలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, తేనె కలిపి మొహానికి ప్యాక్ వేస్తె ముఖం చర్మం టైట్ గా అయిపోతుంది. పది నిమిషాల తర్వాత కడిగేస్తే తేడా తెలుస్తు వుంటుంది. లేదా తేనె, కోడిగుడ్డు తెల్లసోన నిమ్మరసం, ముల్తనీ మట్టి కలిపి ప్యాక్ వేస్తె ఇంకా బెస్ట్. పది నిముషాల తర్వాత కడిగి చుస్తే ముఖం పైన జిడ్డు, పేరుకొన్న మురికి అన్ని పోయి మొహం చక్కని మెరుపు తో కనిపిస్తుంది.
Categories
Soyagam

ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.

Leave a comment