టులిప్ తోటల్ని  చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్  లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా  స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే సరికి  సన్నగా వుండేలా  కటింగ్ ఉంటుంది. ఈ అందమైన తులపై సల్వార్ పైకి కుర్తీ కుర్తా లాంగ్ కమీజ్ లు వేసుకోవచ్చు. హాజరయ్యే సందర్భాన్ని బట్టి ఇది డిజైనర్ మెరుపులా లేదా ఎంబ్రాయిడరీనా సాదా డ్రెస్ నా  ఎంచుకోవచ్చు. ఇక ఈ డ్రెస్ లో ఎంత మందితో వున్నా టులిప్ పువ్వంత అందంగా ప్రత్యేకంగా కనిపించటం ఖాయం.

Leave a comment