బ్రేక్ ఫాస్ట్ గా సాయంత్రం స్నాక్స్ గా ఎపుడూ ఉప్మాలో రవ్వట్లో తినక్కర్లేదు. ఉడికించిన లేదా కాల్చిన  చిలకడదుంప వుంటే చాలు . ఇందులో వుండే మాగ్నేషియం శరీరాన్ని తేలికగా వుంచటం తో పాటు చక్కని తీయని రుచితో వెరైటీ టిఫిన్ అనిపిస్తుంది. ఈ దుంపల పులుసు తియ్యగా చేసినా బావుంటుంది. చిలకదుంపలోని బీటాకెరోటిన్లు చర్మానికి మేలు చేసి యవ్వనంగా వుండేలా చేస్తాయి. ఇందులో పీచు సమృద్ధిగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. ఈ దుంపలో ఎక్కువగా వుండే విటమిన్ బి6 గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. నోటిపూతతో బాధపడేవాళ్లు ఈ దుంపలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. పొటాషియం అధికంగా వుండే వాటిలో చిలకడ దుంప ఒకటి ఇది రక్తపోటును అదుపులో వుంచుతుంది. శరీరంలోని ఎలక్ట్రో లైట్లు సమీపంలో వుండేందుకు  ఇందులోని పోషకాలు సాయం చేస్తాయి. హృదయ స్పందన మెరుగ్గా ఉంటుంది. ఈ దుంపల్లో ఇనుము కూడా ఎక్కువే. రోగనిరోధ శక్తి ని పెంచటంలో ఈ దుంపల కీలక పాత్ర పోషిస్తాయి.

Leave a comment