Categories
Soyagam

ఈ ఎండలకి జుట్టు పొడిబారనివ్వద్దు.

కొన్ని సహజమైన పద్దతులు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన సౌందర్య పద్దతుల కంటే ఈ మిశ్రమం జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని జుట్టు పొడిబారకుండా కాపాడుతుందని నిపుణులు చెప్పుతున్నారు. మూడు స్పూన్ల గొరింటాకు పొడి తో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగ తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే నాని మెత్తబడుతుంది. అరటి పండు మిక్సిలో వేసి గ్రియిడ్ చేయాలి. దీన్ని గోరింటాకు మజ్జిగ మిశ్రమం తో కలపాలి. చిక్కగా ఉందనిపిస్తే ఇంకొంచం మజ్జిగ ఇందులో కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఇది జుట్టును ఆరోగ్యంగా పెరిగేందుకు సాయ పడుతుంది. జుట్టు పొడిబారి పోకుండా పట్టులా చక్కగా మెరుస్తూ వుంటుంది. ఈ ఎండల్లో ఇది మంచి ఉపయోగ పడే హెయిర్ ప్యాక్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవు కనుక నిశ్చింతగా అప్లయ్ చేయొచ్చు.

Leave a comment