ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల  రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ చేయాలి. పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గోరువెచ్చని నూనెలో నిమ్మరసం వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడాలి. హెయిర్ వాష్ కు ముందు కొబ్బరి నూనె అప్లయ్ చేయాలి. హెయిర్ కేర్ స్టైలింగ్ ఉత్పత్తుల్ని హేతుబద్దంగా వాడాలి. హెయిర్ డ్రై లు రంగులు శిరోజాల స్క్రబ్బర్స్ కు హాని కలిగిస్తాయి. బ్లో డ్రయింగ్  రీ బాండింగ్ వంటి హీటింగ్ పద్ధతుల క్యూటికల్స్ ఓపెన్ అవటానికి జుట్టు చిట్లి పోవటానికి ప్రధాన కారణం అవుతాయి.

Leave a comment