వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు  నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే  హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

Leave a comment