కుకుర్ బిటేషియన్ కుటుంబానికి చెందిన బంగారు కాంతితో మెరిసిపోయే గుమ్మడి పోషకాల మాయం. బ్రెడ్, సూప్స్, పుడ్డింగ్స్, పాన్ కేక్స్, కూరలు, జ్యూసుల్లో విరివిరిగా వాడతారు. వందగ్రాముల ముమ్మడి లో 25 నుంచి 30 క్యాలరీలు  మాత్రమే ఉంటాయి. జీర్ణ వ్యవస్ధకు సాయం చేసే ఎక్కువ పరిణామంలో పీచు పదార్ధాలు ఉన్నాయి. బి-కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలైట్లు, రాగి, జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మానవ దేహానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. గుమ్మడి గింజలు మంచివే. వాటిలో గుండె ఆరోగ్యాన్ని నిలబెట్టే మోనో అనే సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో కండరాళ్ళ బలం పెంచే పోటాషియం ఒక కప్పు వండిన గుమ్మడి కాయలోనే 550  మిల్లీగ్రాములు వుంటుంది. ఇందులోని ACE విటమిన్లు కాన్సర్లు రానీయవు.

Leave a comment