స్లీవ లెస్ దుస్తులంటే అమ్మాయిలకు మహిళలకు అందరికీ ఇష్టమే కానీ చేతుల కింద వుండే నలుపు వల్ల ఈ రకం దుస్తులు వేసుకునేందుకు భయపడతారు. చేతుల కింద అవాంచిత రోమాలను ఎంత నీట్గా షేవ్ చేసినా ఈ నలుపు ఇబ్బంది పెడుతుంది. బిగుతైన దుస్తులు సింధటిక్, ఫ్యాబ్రిక్ తయ్యారయ్యె వస్త్రాల వల్ల రాపిడి పెరిగి, స్వేధం కలిసి ఆర్మ్ ఫిట్స్ నల్లబడతాయి. కనుక ఇలాంటి రాపిడి లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని రకాల హెయిర్ రెమొవింగ్ క్రీమ్స్ వల్ల చర్మం నల్ల బడుతుంది. ఇటువంటి క్రీమ్స్ కనుక వాడినట్లు అయితే గోరువెచ్చని నీటి తో వాష్ చేయాలి. పుల్లర్స్ ఎర్త్ తో తయ్యారైన పాక్స్  వెయ్యడం వల్ల రసాయినాల ప్రభావాన్ని గ్రహిస్తాయి. చేతులకింద స్వేదం ఎక్కువగా వుంటుంది. ఈ ప్రదేశం క్లీన్ గా పొడిగా వుంచుకోవాలి. చర్మం పై నేరుగా దియోడరెంట్స్ స్ప్రే చెయ్యాకూడదు.

Leave a comment