కొబ్బరి నూనె ఎన్నో సౌందర్య ఉత్పత్తులకి ప్రత్యామ్నాయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాడీ లోషన్ కు బదులు కొబ్బరి నూనె స్నానం అయ్యాక వంటికి రాసుకుంటే అది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చర్మం లోకి త్వరగా ఇంకిపోయి జిడ్డు అనిపించదు. కాటుక గానీ ఐ లైనర్ గానీ వదలక పొతే కొబ్బరి నూనె బాగా ఉపయోగ పడుతుంది. కాటన్ పీస్ పైన కొబ్బరి నూనె వేసి తుడిస్తే ఆ ఛాయలు కూడా ఉండవు. లిప్ బామ్ కు బదులుగా కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె తేనె సమపాలల్లో తీసుకుని ఫేసుమాస్క్ వేసుకుని గోరువెచ్చని నీళ్ళ తో మొహం కడుక్కుంటే , మొహం తేటగా మృదువుగా ఉంటుంది.

Leave a comment