పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో  రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

Leave a comment