చక్కని ముఖ సౌందర్యం కోసం ఎన్నో ఖరీదైన ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా వుండే కాస్మెటిక్  క్రీముల వల్ల చర్మానికి ఎప్పుడు నష్టమే. అందువల్ల సహజసిద్దమైన ఫేస్ పాక్సే ఎప్పుడు బెటర్. నేచురల్ ప్యాక్స్ వల్ల చర్మం పై వుండే మృతకాణాలు తొలగి పోయి మొహం కంటి వంతంగా మారుతుందని మచ్చలు మొటిమలు తగ్గిపోతాయని చెప్పుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోను టమాటాలు, నిమ్మకాయలు ఇంటి పెరటిలో అలోవీరా లు సహజంగా వుంటుంటాయి  వీటి తోనే అద్భుతమైన ప్యాక్స్ తయ్యారు చేయవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ లో అలోవీరా గుజ్జు, పాలు, టమాటా గుజ్జు, నిమ్మ తోక్కల పొడి వేసి బాగా మిక్సి చేసి, ఆ గుజ్జు తో ఫేస్ ప్యాక్ వేసుకుని చూడండి. ఆరాక ముఖం కడిగేస్తే మొహం మిలమిలలాడుటుంది. ఖరీదైన ఫేస్ ప్యాక్స్ ఈ సహజమైన పాక్ ముందు తెలి పోతాయి.

Leave a comment