నీహారికా,

ఇన్ ఫో మానియా గురించి విన్నావా? అంటే స్మార్ట్ ఫోన్ ఉ అనారోగ్య కరమైన ఎడిషన్ అన్నమాట. ఇప్పుడీ సమస్య భార్యా భర్తల మద్యని తీవ్ర అనర్ధం సృష్టిస్తుందని ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఉదయం అవ్వగానే జాబ్స్ కోసం బయటికి పోయిన భార్యా భర్తలు ఇంటికి వచ్చి కాసేపీ అయినా సరదాగా గడపకుండా, చెరో వైపుకు ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనో తలడుర్చుతుంటే వాళ్ళకు ఇన్ఫో మేనియా వున్నట్లు లెక్క. ఇదే ధోరణి వైవాహిక భందవ్యం పై తీవ్ర పరిణామం చుపిస్తుందిట. నిద్ర పోయే ముందర కుడా స్మార్ట్ ఫోన్ వదలకపొతే తప్పేకదా. స్మార్ట్ ఫోన్ నిరంతరం చెక్ చేసుకుంటే, సమాచారం ఓవర్ లోడ్ అయిపోతుంది. ఇదే భారీ సమస్యలకు దారి తీస్తుంది. ఏ పార్టీకి వెళ్ళినా, ఇతర కార్యక్రమాల్లో మరే పనిలో నిమగ్నం కావాల్సి వచ్చినా, ఎవరితో ముఖా ముఖ కబుర్లు ఆడుతున్నా తాము లోపల ఎదో మిస్ అయిపోతున్నామన్న అపరాధ భావాలతో ఉంటారట ఈ ఫోబియా పెట్టుకుంటే ఇక నెమ్మదిగా మానసిక సమస్యలు మొదలవ్వుతాయన్నమాట. ఫోన్ విషయం జాగ్రత్త సుమా.

Leave a comment